685
-
కరువు రణము మరణము చూచి – కలుగదు మారుమనస్సు
ప్రవచనములు సంపూర్ణములాయెను
యూదులు తిరిగి వచ్చుచున్నారు ||రండి||
-
ప్రభు యేసు నీ కొరకై తనదు – ప్రాణము నిచ్చె గదా
సిలువను రక్తము చిందించియును
బలియాయెను యా ఘనుడు మనకై ||రండి||
-
యేసుని నామమునందె పరమ – నివాసము దొరకును
ముక్తిని పాప విమోచనమును
శక్తిమంతుడు యేసే యిచ్చును ||రండి||
-
నేనే మార్గము నేనే సత్యము – నేనే జీవమును
నేను గాకింకెవరు లేరని
యెంచి చెప్పిన యేసుని వద్దకు ||రండి||
إرسال تعليق