601
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఇన్ని నాళ్లు ధరను మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి యెపుడు గాచియు ఎన్నిలేని దీవెన లిడు నన్న యేసువా యన్ని రెట్లు స్తోత్రము లివిగో ||వందనం||
- ప్రాత వత్సరంపు బాప మంతయు బ్రీతిని మన్నించి మమ్ము గావుము నూత నాబ్దమనను నీదు నీతి నొసగు మా దాత క్రీస్తు నాధ రక్షకా ||వందనం||
- దేవ మాదు కాలుసేతు లెల్లను సేవకాళి తనువు దినము లన్నియు నీ వొసంగు వెండి, పసిడి జ్ఞాన మంత నీ సేవకై యంగీకరించుమా ||వందనం||
- కోతకొరకు దాసజనము నంపుము ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము ఖ్యాతి నొందు నీతి సూర్యుడా ||వందనం||
- మా సభలకు పెద్దజేసి పెంచుము నీ సువార్త జెప్ప శక్తి నీయుము మోసపుచ్చు నంధకార మంత ద్రోయుము యేసు కృపన్ గుమ్మరించుము ||వందనం||
Post a Comment