502
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- తెరచి మూయంగ రానట్టి ద్వారములారా మీ శిరము లెత్తుకొని యుండు డి యనాదిగ నుండు వర క వాటములారా మీరే యెత్తంగ బడుడీ సురచిన మహిమ స్ఫురణలుగల మీ దొరతన పరిశుద్ధుల కరు లగు భీ కర దురితాత్ముల దురమున జిదిపి య పరిమిత బల జయ బిరుదాంకితు డై చిరముగ నూతన యెరుసలేమ పుర పరి పాలన ద త్పరుడై యిదిగో నెరవుగ వచ్చెను నిజ భక్తులతో ||ఎంతో||
- సుందర మందానిలమందు జీవ సంజీవా నందసౌఖ్య ప్రదమై యుండ రేబగ లంటని మందిర వాసులప్పుడు జయజయశబ్దముల బొందుగ గ్రీస్తుని పొగడుచు బాడుచు నందఱు పరమా నందంబున జె న్నొంది తనందరి కిందగు రాజుగ వందనములు తగ వరుస నొనర్చుచు నందముగా ప్రభు జెందిన భక్తుల బృందములకు దగు విందు లొనర్చిరి పొందిక కలిగెను భూమికి ముక్తికి ||ఎంతో||
- ములపై బెట్టి కళ లీను ధవళ వస్త్రములు గట్టంగ నిచ్చి చెలువుగ మరి వా రల చేతుల లో పల విజయార్థపు బర్ణము లొసగి సకల దూతలు భ క్తులతో గూడి వి మల పీఠము ముం గల నిలువబడి పొలువగ దమ దే వునకును గ్రీస్తున కెలమిని స్తోత్రము బలఘన మనిశము కలుగును గాకని పలికి నుతించిరి ||ఎంతో||
- పరిశుద్ధవంతు లప్పుడు శాశ్వతానంద భరితులై వీణెలు ధరియించి పాటులు బాడుచును గురురాయడైన తమ ప్రభుని గుణములు వర్ణించి కరుణను నీ ర క్తముచే మము నం దఱి ధరణింగల నరవంశస్థుల తరములలో నుం డరుదుగ దేవుని కొఱకుగదా మము గొనియుంటిని యని మురువుగ నిక దే వుని కొఱకుగదా మము గొని యుంటిని యని మురువుగ నిక దే వుని సముఖంబున దొరలను నర్చక వరుల జేసితివి ధర నేలుదు మిక సరియని మ్రొక్కిరి ||ఎంతో||
إرسال تعليق