a311

311

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    జను లందఱు వినండి దివ్య సంగతి తండ్రియైన దేవు డెంత ప్రేమ చూపెను. ||యేసు క్రీస్తు నాకుగాను బ్రాణ మిచ్చెను తన్ను జేర నన్ను బిల్చెన్ క్రీస్తు వత్తును ||

  1. నరకోటి పాపమందు మున్గి యుండగా దండ్రి వారలన్ రక్షింప ద్రోవ చేసెను.
    మాకు గాను ప్రాణమిచ్చి మృత్యు వొందను తన యేక పుత్రు నిచ్చి పంపె నిలకున్.
    ఆయనను నమ్మువారు నాశ మొందక నిత్యజీవ మొందిసదా సంతసింతురు.
    పాపభారము భరించు పాపులెల్లరు యేసు మాట వినగాను బాధ తీఱును.
    చేర రండి, సువిశ్రాంతి నిత్యసంతుష్టి మీకు నిత్తు నంచు యేసు మిమ్ము బిల్చును

Post a Comment

أحدث أقدم