a207

207

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఎంత గొప్ప బొబ్బ పుట్టెను దానితో రక్షణ మంతయును సమాప్త మాయెను ఎంత గొప్ప బొబ్బ పుట్టెను యేసునకు కల్వరి మెట్టను సంతసముతో సిల్వ గొట్టగ నూర్యు డంధకారమాయెను ||ఎంత||

  1. గలిబిలి గలిగె నొకప్పుడు శిన్యారు బాబెలు కట్టడము కట్టునప్పుడు పలుకు భాషయు నొక్క టైనను పలువిధములగు భాషలాయెను నలుదెసలకును జనులు పోయిరి కలువరి పై కలిసికొనిరి ||ఎంత||

  2. పావనుండగు ప్రభువు మనకొరకై యా సిలువమీద చావునొందెడు సమయమందున దేవుడా నా దేవుడా నన్నేల చెయివిడిచితివి యనియా రావముగ మొఱబెట్టెను యె హోవయను దన తండ్రితోను ||ఎంత||

  3. అందు దిమిరము క్రమ్ము గడియయ్యొ నా నీతి సూర్యుని నంత చుట్టెను బంధకంబులు నిందవాయువు లెన్నో వీచెను కందు యేసుని యావరించెను పందెముగ నొక కాటువేసెను పాత సర్పము ప్రభువు యేసును ||ఎంత||

  4. శాంతమాయె నటంచు బలుకుచును ఆ రక్షకుడు తన స్వంత విలువగు బ్రాణమును వీడెన్ ఇంతలో నొక భటుడు తనదగు నీటెతో ప్రభు ప్రక్క బొడువగ చెంతజేరెడి పాపులను ర క్షించు రక్తపు ధార గారెను ||ఎంత||

Post a Comment

أحدث أقدم