a182

182

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఎంతో దుఃఖము బొందితివా నాకొర కెంతో దుఃఖము పొంది తివా యెంతో దుఃఖము నీకు ఎంతో చింతయు నీకు ఎంతో దిగులయ్యా నాకు ఆ పొంతి పిలాతు యూ దులు నీకు బెట్టిన శ్రమలను దలపోయ గా ||నెంతో||

  1. వచ్చిరి యూదులు ముచ్చట లాడుచు నెచ్చట వాడనుచు నిన్ను మచ్చరముతో వారి యిచ్చ వచ్చినట్లు కొట్టి దూషించినారా ||యెంతో||

  2. సుందరమగు దేహ మందున దెబ్బలు గ్రంధులు గట్టినవా నీవు పొందిన బాధ నా డెందము తలపనా నందములే దాయెను ||ఎంతో||

  3. కొట్టుకొట్టుమని తిట్టికేల్ దట్టిని న్నట్టిట్టు నెట్టుచును వారు పెట్టుశ్రమలు తుద మట్టున కోర్చియు బెట్టితివా ప్రాణము ||నెంతో||

  4. నెపము బెట్టుచు దిట్టి యపహసించుచు యూద చపలులు గొట్టి నారా నా యపరాధములకు నా పదలను బొంది నీ కృప నాకు జూపినావా ||యెంతో||

  5. చక్కని నా యేసు మిక్కిలి బాధ నీ కెక్కువ గలిగె నయ్యా ఆహా యొక్క దుష్టుడీటె ప్రక్కను గ్రుచ్చి తన యక్కస దీర్చుకొనెనా ||యెంతో||

  6. అన్నదమ్ములైన అక్క సెల్లెం డ్రైన కన్న పిత్రాదు లైన నన్ను ఎన్న డైన బ్రేమించలే రైరి నా యన్నా ప్రేమించినావా ||యెంతో||

Post a Comment

أحدث أقدم